సర్వీసులో మరణించిన సభ్యులకు పరిహారం పెంచిన EPFO.. ఇకపై సాయం రూ.15 లక్షలు..!

సర్వీసులో మరణించిన సభ్యులకు పరిహారం పెంచిన EPFO.. ఇకపై సాయం రూ.15 లక్షలు..!

EPFO Hikes Ex-gratia: ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డు ఉద్యోగుల కుటుంబాలకు మద్దతుగా మరింత బలమైన ఆర్థిక సహాయం అందించేందుకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి డెత్ రిలీఫ్ ఫండ్ నుంచి ఎక్స్-గ్రేషియా సాయాన్ని గతంలో ఉన్న రూ 8.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ మార్పు 1 ఏప్రిల్ 2025 నుంచి అమల్లోకి ఉంచుతున్నట్లు ఈపీఎఫ్ఓ వెల్లడించింది. 

పెంచిన మెుత్తాన్ని మృతి చెందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు లేదా లీగల్ హెయిర్లకు స్టాఫ్ వెల్ఫేర్ ఫండ్ ద్వారా అందించబడుతుంది. ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు ట్రస్టీలు, గవర్నమెంట్, ఎమ్ప్లాయర్స్,  ఉద్యోగుల ప్రతినిధులు కలిసి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనికి తోడు మరో శుభవార్త ఏంటంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రతి ఏటా ఈ ఎక్స్-గ్రేషియా మెుత్తాన్ని ఏటా 5 శాతం చొప్పున పెంచే విధానానికి కూడా వారు అంగీకరించారు. ఈ ఏటా పెంపు నిర్ణయం కారణంగా మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక ఒత్తిడి తగ్గటంతో పాటు పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి కొంత ఉపశమనం పొందటానికి వీలు ఉంటుంది. 

ఈపీఎఫ్ఓ సంస్థ తన సభ్యుల కోసం 2025లో మరిన్ని మార్పులను ప్రకటించింది. మార్పుల ప్రకారం మరణించిన వ్యక్తి క్లెయిమ్ ప్రాసెస్ సులభరం చేస్తూ.. ఇకపై గార్డియన్ షిప్ సర్టిఫికెట్ అక్కర్లేకుండానే మైనర్ పిల్లల బ్యాంక్ ఖాతాల్లోకి సెటిల్మెంట్ డబ్బు జమచేయాలని నిర్ణయించారు. అలాగే తమ యూఏఎన్ ఖాతాకు ఆథార్ లింక్ చేయని లేదా వెరిఫై చేసుకోని వ్యక్తులు లేదా ఆధార్ వివరాల్లో తప్పులను సరిచేయాల్సిన వ్యక్తులకు డిక్లరేషన్ ప్రక్రియను సులభరం చేసింది ఈపీఎఫ్ఓ సంస్థ.