ఎన్నికల ముందు రైతుబంధు నిధులు విడుదల చేస్తరా.?

ఎన్నికల ముందు రైతుబంధు నిధులు విడుదల చేస్తరా.?

ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లొంగిపోయిందని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేన రెడ్డి అన్నారు. మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం లో గౌరవం లేకుండా ఎన్నికల కమిషన్ ఉందని అన్నారు. రాష్ట్రంలోని పోలీసులు ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసను చూస్తున్నారే తప్ప ఆపడం లేదని, కనీస భద్రత కూడా కల్పించడం లేదని ఆయన అన్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా, ప్రచార కర్తలుగా మారారని ఆరోపించారు. పత్రిపక్ష నేత లను వేధిస్తూ.. అనేక మున్సిపాలిటీలలో బీజేపీ కార్యకర్తలను కొట్టడం, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అందుకు పోలీసులు కూడా సహకరిస్తున్నారన్నారు. ఈ ఘటనలపై చాలా చోట్ల ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

అధికార పార్టీ నేతలు డబ్బులు, మద్యం పంచుతున్నారని చేసిన ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదన్నారు ఇంద్రసేన రెడ్డి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లో బీజేపీ అభ్యర్థి పై దాడి చేసిన నిందితులను పట్టుకోలేదని, అధికార పార్టీ నేతలు కోడ్ ను ఉల్లగించి కాన్వాయ్ వాడుతున్నా.. ఎలెక్షన్ కమిషన్ పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నికల ముందు రైతు బంధు నిధులు విడుదల చేయడం ఓటర్ల ను మభ్యపెట్టడమేనని ఆయన అన్నారు.

bjp senior leader indrasena reddy fires on election commission and state police