మహేశ్ ఆత్మహత్యకు సర్కారే కారణం

మహేశ్ ఆత్మహత్యకు సర్కారే కారణం

ఉద్యోగ నోటిఫికేషన్  రాక ఆత్మహత్య చేసుకున్న మంచిర్యాల జిల్లా  చెన్నూరు నియోజకవర్గం బబ్బర చెలుక గ్రామానికి చెందిన మహేష్ కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మహేష్ తల్లిదండ్రులను ఓదార్చారు. మహేష్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహేశ్ ఆత్మహత్యకు సర్కారే కారణమన్నారు వివేక్ వెంకటస్వామి. 

50 లక్షల పరిహారం ఇవ్వాలి-బీజేవైఎం

మరో వైపు నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు మంచిర్యాల జిల్లా బీజేవైఎం నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలని డిమాండ్  చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో BJYM ఆధ్వర్యంలో  కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర చేశారు. నోటిఫికేషన్లు వేయడం లేదని మనస్థాపంతో చనిపోయిన మహేష్ కుటుంబానికి 50లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.