ఆ 160 సీట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్..టార్గెట్ 350

ఆ 160 సీట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్..టార్గెట్ 350

2024 ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ ప్రణాళికలు వేస్తోంది. ముందస్తు సర్వేల్లో బీజేపీదీ విజయమని ఇప్పటికే పలు సర్వేల్లో వెల్లడయ్యింది. ప్రధానంగా గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ఓడిపోయిన స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

ఆ 160 సీట్లపై స్పెషల్ ఫోకస్ 

పోయిన సారి బీజేపీ సెకండ్ ప్లేస్ లో నిలిచిన, చాలా తక్కువ మార్జిన్ తో ఓడిన స్థానాలపైనే ఈ సారి ఆ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇలాంటివి మొత్తం 160 నియోజకవర్గాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ నియోజవర్గాల్లో గెలుపు బాధ్యతలను కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు అప్పగించింది. ఇందులో భాగంగా లోక్ సభ ప్రవాస్ యోజన పేరుతో స్పెషల్ క్యాంపెయిన్ కూడా చేపట్టింది. అలాగే సోనియా గాంధీ, అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, శరద్ పవార్, ఇతర ప్రముఖుల నియోజకవర్గాల్లో, పార్టీ ఎన్నడూ గెలవని సీట్లపైనా ప్రత్యేకంగా దృష్టి సారించింది. 

టార్గెట్ .. 350 

2019 ఎన్నికల్లో సొంతంగానే 303 సీట్లు, 38 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈ సారి 350కిపైగా సీట్లు గెలవాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. ఇందుకోసం పార్టీలోని అన్ని వర్గాలను సైమల్టేనియస్ గా రంగంలోకి దింపింది. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం మైక్రో మేనేజ్ మెంట్ మోడ్ లోకి వెళ్లింది. ఈ స్ట్రాటజీని పక్కాగా అమలు చేయడం కోసం దేశంలోని రాష్ట్రాలను, యూటీలను నార్త్, ఈస్ట్, సౌత్ అనే మూడు ప్రాంతాలుగా విభజించుకుంది.