
హైదరాబాద్, వెలుగు: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను అవమానించేలా టీఆర్‌ఎస్ నేతలు మాట్లాడటాన్ని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఖండించారు. కేంద్ర మంత్రిగా ఉన్న మహిళనే గౌరవించలేని వారు, రాష్ట్రంలోని సామాన్య మహిళలను ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిని అవమానించినందుకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. చెంచాగిరి చేసే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ట్విట్టర్ పిట్ట కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. నిర్మలా సీతారామన్ కాలి గోటికి పల్లా సరిపోడన్నారు. బాధ్యత గల నాయకులే సోషల్ మీడియాలో మహిళా మంత్రిని అవమానించేలా పోస్టులు పెట్టిస్తుంటే, వారిని ఫాలో అయ్యే యువత మహిళలను ఎలా గౌరవిస్తారని ప్రశ్నించారు.