వయనాడ్ విషాదం: విజయన్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు

వయనాడ్ విషాదం: విజయన్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు

కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌డిఎంఎ) నుండి ముందస్తు అనుమతి తీసుకోకుండా రాష్ట్రంలోని సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు ఎటువంటి ఫీల్డ్ విజిట్‌ చేపట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పలవురు నాయకులు సీఎం విజయన్ పై నిప్పులు చెరిగారు. దీనిపై బిజెపి కేరళ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందించారు. రాష్ట్రంలోని పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం వాయనాడ్ విపత్తు ప్రాంతాలను సందర్శించకుండా, అభిప్రాయాలను పంచుకోకుండా శాస్త్రవేత్తలను నిషేధిస్తూ తాలిబానీ ఫత్వా జారీ చేసిందన్నారు. 

వాతావరణ కేంద్రం భారీ వర్షాల గురించి ముందస్తుగానే కేరళ ప్రభుత్వాన్ని హెచ్చరించిందన్నారు. 23, 24, 25, 26 తేదీల్లో వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసిందన్నారు. వయనాడ్ లోని చాలా ఏరియాలు వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. పర్యావరణపర ప్రాంతమైన వయనాడ్ లో విచ్చలవిడిగా రిసార్ట్ ల అక్రమ నిర్మాణాలు చేశారని.. ఆ అక్రమ నిర్మాణాలకు విజయన్ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందన్నారు.

ఆదేశాలను ఉపసంహరించుకున్న  సీఎం విజయన్

ప్రతి పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో,SDMA జారీ చేసిన వివాదాస్పద నోట్‌ను ఉపసంహరించుకోవాలని సీఎం పినరయి విజయన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి.వేణును ఆదేశించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి ఇతరుల భావాప్రకటన స్వేచ్ఛను హరించే హక్కు లేదని సీఎం విజయన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో వయనాడ్‌లో ఇటీవల కొండచరియలు విరిగిపడి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంబంధించిన నేపథ్యంలో రాష్ట్రంలోని శాస్త్ర సాంకేతిక సంస్థలు తమ అభిప్రాయాలను, అధ్యయన నివేదికలను మీడియాతో పంచుకోకుండాSDMA  ఆదేశాలు జారీ చేసింది.