ఆ వీడియోలు జబర్దస్త్ కామెడీ షోలా ఉన్నయ్:బండి సంజయ్

ఆ వీడియోలు జబర్దస్త్ కామెడీ షోలా ఉన్నయ్:బండి సంజయ్

కేసీఆర్ ప్రెస్ మీట్ జబర్థస్త్ కామెడీ షో అంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్  ట్వీట్ చేశారు. దీని నిర్మాత, డైరెక్టర్, రైటర్ కేసీఆరేనని సెటైర్లు వేశారు. ఫాంహౌజ్ డ్రామాలో నటించింది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ట్వీట్ చేశారు. మీడియా పార్ట్ నర్ పింక్ మీడియా అంటూ బండి సంజయ్ పోస్ట్ పెట్టారు.

మరోవైపు మొయినాబాద్ ఫాంహౌస్ ఘటనలో కేసీఆర్ చూపించిన వీడియోలో ఏమిలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయటివాళ్లతో బేరసారాలు చేసే కర్మ తమకు లేదన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలని.. బ్రోకర్ల ద్వారా పార్టీలో ఎవరిని చేర్చుకోమని చెప్పారు. 100 కోట్లు కాదు 100పైసలకు కూడా ఆ ఎమ్మెల్యేలను ఎవరు కొనరని ఎద్దేవా చేశారు. ఫాంహౌజ్ ఘటనపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. ఫాంహౌస్ ఘటనలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి వచ్చారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని అడిగారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. స్వామిజీలతో ప్రభుత్వం కూలిపోతుందా అని ప్రశ్నించారు. ఎన్నో పార్టీల గొంతు నొక్కి.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన కేసీఆర్.. ప్రజాస్వామ్యాన్ని బతికించండి అనడం సిగ్గుచేటన్నారు.  తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కిషన్ రెడ్డి విమర్శించారు. మునుగోడు బైపోల్ తర్వాత కేసీఆర్లో ఆందోళన పెరిగిందన్నారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేసిన ఘటనలో కేసీఆర్ లేడా అని ప్రశ్నించారు.