
- ఇయ్యాల, రేపు నల్గొండ, సూర్యపేటలో రాంచందర్‌రావు పర్యటన
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్.రాంచందర్‌రావు సోమవారం సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామం నల్లబండగూడెంలో పర్యటించనున్నారు. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇయ్యాల, రేపు.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం చౌటుప్పల్, చిట్యాలలో పర్యటిస్తారు. నల్గొండ పట్టణంలో వివిధ సంఘాలు, లాయర్లు, డాక్టర్లతో సమావేశమవుతారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యపేటలో బీజేపీ ఆఫీసును ప్రారంభించనున్నారు. రాత్రి కోదాడ నియోజకవర్గంలోని స్వగ్రామం నల్లబండగూడెంలో గ్రామస్థులతో మాట్లాడి, అక్కడ బస చేయనున్నారు. మంగళవారం స్వగ్రామంలోని దేవాలయంలో పూజలు నిర్వహించి, రైతులు, వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కోదాడలో పర్యటిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు చౌటుప్పల్ మండలంలో అవుషాపూర్ లో స్థానిక సంస్థలపై జరిగే వర్క్‌షాప్‌లో పాల్గొంటారు.