మంత్రి సురేఖ రాజీనామా చేయాలి  : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌‌ రావు 

మంత్రి సురేఖ రాజీనామా చేయాలి  : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌‌ రావు 

హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ స్టేట్​చీఫ్​ రాంచందర్‌‌రావు డిమాండ్​ చేశారు. దేవుళ్లపై నమ్మకం లేని వాళ్లకు దేవాదాయ శాఖ ఎందుకని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్​లోని పార్టీ స్టేట్ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కించపరిచిన తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులకు అక్కడి ప్రజలు బుద్ధి చెప్పారని, తెలంగాణలో  కాంగ్రెస్ కూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.  అనంతరం పలువురు డాక్టర్లు బీజేపీలో చేరగా కండువాలు కప్పారు.

రాజీనామా చేయననడం ఏంటి?

ఎన్నికల్లో ప్రజాతీర్పు వ్యతిరేకంగా వచ్చినా.. మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయననడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని రాంచందర్ రావు అన్నారు. లాలాపేటలో ప్రధాని బహిరంగ సభ వాల్ రైటింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీకి అందులో ఏముందో తెలయదని విమర్శించారు. విచ్ఛిన్నకర రాజకీయాలు చేసిన పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు.