‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా రాదు

‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా రాదు
  •     బీజేపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు నామాజీ

కొడంగల్, వెలుగు : వరద జలాల మీద ఆధారపడే పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రాదని బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యుడు నాగురావు నామాజీ చెప్పారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.22 వేల కోట్లు ఇచ్చిందని తెలిపారు. శనివారం ఆయన కొడంగల్​లో మీడియాతో మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ఎంక్వైరీ చేయాలని డిమాండ్​చేశారు.

దేశంలో మోదీకి ఎదురులేదని, కాంగ్రెస్​పీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు. కిషన్​రెడ్డి కృషితోనే 108 కిలోమీటర్ల వికారాబాద్– కృష్ణ రైల్వేలైన్​కు గ్రీన్ సిగ్నల్ లభించిందన్నారు. టీఆర్ఎస్.. బీఆర్ఎస్​గా మారిన రోజే ఆ పార్టీ కథ ముగిసిందని విమర్శించారు. పాలమూరు అభివృద్ధి కోసం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణకు ఓటేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పున్నంచంద్ లాహోటి, బస్వరాజ్​ తదితరులు పాల్గొన్నారు.