నేడు (అక్టోబర్ 5) బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్..

నేడు (అక్టోబర్ 5) బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్..
  • హాజరుకానున్న పార్టీ రాష్ట్ర సహ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి అభయ్ పాటిల్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్స్ సమావేశం సోమవారం జరగనున్నది. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌‌‌‌‌‌‌‌ రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర సహ ఇన్‌‌‌‌చార్జ్ అభయ్ పాటిల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ భేటీకి పార్టీ రాష్ట్ర పదాధికారులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు అటెండ్‌‌‌‌ కానున్నారు.

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రూపొందించాల్సిన ఉద్యమ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖైరతాబాద్ ఉపఎన్నికతో పాటు పలు పార్టీ కార్యక్రమాలపై చర్చ జరగనున్నది.