ఇయ్యాల రాష్ట్ర బీజేపీ ఆఫీసు బేరర్ల మీటింగ్

ఇయ్యాల రాష్ట్ర బీజేపీ ఆఫీసు బేరర్ల మీటింగ్

హైదరాబాద్, వెలుగు: జులై 2, 3 తేదీల్లో హైదరాబాద్​లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లు, రాష్ట్రంలో బూత్ స్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చించేందుకు మంగళవారం పార్టీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర ఆఫీసు బేరర్ల మీటింగ్ జరుగనుంది. ఇందులో ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జీ తరుణ్ చుగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. మీటింగ్​కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, సీనియర్ నేతలు, తెలంగాణకు చెందిన జాతీయ నేతలు హాజరుకానున్నారు.
ఈ నెల 15 న సర్పంచులతో రాజ్ భవన్​కు పెండింగ్ బిల్లులు, ఇతర సమస్యలను గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఈ నెల 15 న సర్పంచులతో కలిసి బండి సంజయ్ రాజ్ భవన్ వెళ్లనున్నారు.