నేడు బీజేపీ ఆఫీసుల వద్ద కాంగ్రెస్ ధర్నా : పీసీసీ

నేడు బీజేపీ ఆఫీసుల వద్ద కాంగ్రెస్ ధర్నా :  పీసీసీ
  •  సోనియా, రాహుల్‌‌‌‌పై కక్ష సాధింపు రాజకీయాలకు నిరసనగా పీసీసీ పిలుపు

హైదరాబాద్, వెలుగు: సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు నిరసనగా.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని బీజేపీ ఆఫీసుల వద్ద ధర్నాకు పీసీసీ పిలుపునిచ్చింది. దేశంలో కాంగ్రెస్ నేతలపై పెరిగిపోతున్న బీజేపీ అరాచకాలను నిరసిస్తూ అన్ని డీసీసీలు ఈ ధర్నాలను సక్సెస్‌‌‌‌ చేయాలని బుధవారం ఒక ప్రకటనలో పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్ గౌడ్ కోరారు. 

నేషనల్‌‌‌‌ హెరాల్డ్‌‌‌‌ కేసులో సోనియా, రాహుల్‌‌‌‌పై ఇన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్‌‌‌‌ (ఈడీ) కేసులను కోర్టు తప్పుబట్టిందని గుర్తుచేశారు. అలాగే, జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించతలపెట్టిన దీక్షలను ఆదివారానికి వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు ఈ ఆందో ళన కార్యక్రమాలను సీరియస్‌‌‌‌గా తీసుకొని విజయవంతం చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల పార్టీ క్యాడర్‌‌‌‌‌‌‌‌కు విజ్ఞప్తి చేశారు.