దేశ భద్రతకు ముప్పుగా ‘శాంతి బిల్లు’ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దేశ భద్రతకు ముప్పుగా ‘శాంతి బిల్లు’ : ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ప్రైవేటు సంస్థలకు అణుశక్తి బాధ్యతలు అప్పగించొద్దు: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  •     అణు ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?
  •     కొన్ని తరాల భవిష్యత్తు నాశనం అవుతది
  •     ‘అశాంతి బిల్లు’ అని పేరు పెట్టాలని చురకలు
  •     లోక్​సభలో బిల్లుపై చర్చకు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: అణుశక్తి రంగంలో ప్రైవేట్ సంస్థలకు బాధ్యతలు అప్పగించేలా తీసుకొచ్చిన ‘శాంతి బిల్లు’ దేశ, ప్రజల భద్రతకు ముప్పు అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విమర్శించారు. లోక్ సభలో ఈ బిల్లుపై చర్చలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన చర్చలో పాల్గొన్నారు. ‘‘శాంతి బిల్లు అని పేరు పెట్టారు గానీ.. వాస్తవానికి ‘అశాంతి బిల్లు’ అని పెట్టాల్సింది. బిల్లులోని అంశాలు దేశంలో అశాంతిని తెస్తాయి. 

అణు ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? సరఫరాదారులను బాధ్యతల నుంచి తొలగిస్తే ప్రజల ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారు?’’అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలాంటి ప్రమాదాలు, ఇబ్బందులు జరగవని అధికార పార్టీ నేతలు చెప్తున్నారని, అదే నిజమైతే ఈ బిల్లులో సరఫరాదారుల బాధ్యతలను తొలగించాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. 

ఫ్రాన్స్, రష్యా, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో అణుశక్తి పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోనే ఉందని గుర్తు చేశారు. కానీ.. ఇండియాలో ఈ కీలక రంగాన్ని ప్రైవేట్ చేతుల్లో పెట్టడం ప్రమాదకరమని స్పష్టం చేశారు. “అణు ప్రమాదం ఉద్దేశాన్ని చూడదు. అది ప్రైవేట్ ప్లాంటా.. ప్రభుత్వ ప్లాంటా.. అన్న తేడా లేకుండా కొన్ని తరాల భవిష్యత్తును నాశనం చేస్తది. ఇది చట్టాన్ని బలహీనపరచడం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే”అని హెచ్చరించారు. 

అదానీ గ్రూప్ కోసమేనా?

అదానీ గ్రూప్.. అణుశక్తి రంగంపై ఆసక్తి చూపిన వెంటనే ఈ బిల్లు రావడం యాదృచ్ఛికమా? అని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు. గత పదేండ్ల తప్పిదాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ప్రైవేటీకరణ అణుశక్తి రంగంలో ప్రపంచవ్యాప్తంగా విఫలమైందని, ఈ బిల్లును పునఃపరిశీలించి ప్రైవేట్ సంస్థలు, సరఫరాదారులపై కఠిన బాధ్యతలు విధించాలని డిమాండ్ చేశారు. ‘‘ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ చెప్పింది. 

మరి గత 11 ఏండ్లలో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్న ప్రశ్నకు కేంద్రం నుంచి సమాధానం రాలేదు. అలాగే, దేశంలో ఉగ్రవాదదాడులు, నిరుద్యోగం, రూపాయి విలువ పతనం, ఇండిగో వంటి కార్పొరేట్ సంక్షోభాలపై ప్రభుత్వం జవాబుదారీతనం చూపడం లేదు’’అని వంశీకృష్ణ అన్నారు. ఇండిగో నిర్లక్ష్యంతో ఎయిర్ ఇండియా సంస్థకు నష్టాలు వచ్చాయని, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు.