నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పల్లెపోరు ప్రశాంతం

నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పల్లెపోరు ప్రశాంతం
  • ఉమ్మడి జిల్లాలో భారీ పోలింగ్ నమోదు
  • యాదాద్రి జిల్లాలో 92.56 శాతం  
  • సూర్యాపేట జిల్లాలో 89.25 శాతం 
  • నల్లగొండ జిల్లాలో 88.72 శాతం పోలింగ్


యాదాద్రి, నల్గొండ, వెలుగు : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఓటర్లను రప్పించడంలో అభ్యర్థులు సక్సెస్​కావడంతో పోలింగ్​ భారీగా జరిగింది.  మూడు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది.

యాదాద్రి మూడో ఫేజ్​లో 92.56..

యాదాద్రి జిల్లాలోని హెచ్​ఎండీఏ మండలమైన చౌటుప్పల్, గిరిజన మండలమైన సంస్థాన్​ నారాయణపురం, మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో మూడోదశ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మూడో ఫేజ్​లో 124 పంచాయతీలు,1086 వార్డుల్లో 1,62,023 ఓటర్లు తమ హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా, మొత్తంగా 1,47,432  (92.56శాతం) మంది ఓటేశారు. మూడు దశలు జరిగిన ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటేసి, అభ్యర్థుల గెలుపులో నిర్ణేతలుగా వ్యవహరించారు. 

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో.. 

మూడో విడత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్​దక్కించుకొని సత్తా చాటింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 351  గ్రామ పంచాయతీలు, 2,664 వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. నల్లగొండలో 89. 72, సూర్యాపేటలో 89.25 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ జిల్లాలో మొత్తం 2,28,135 మంది, సూర్యాపేట జిల్లాలో 1,71,903 మంది ఓటు వేశారు. దీంతో పోలింగ్​పర్సంటేజీ మండలాల్లో 90 నుంచి 80 శాతం వరకు నమోదైంది.