హుజురాబాద్ బైపోల్ కు బీజేపీ ఇంఛార్జ్ లు వీళ్లే..

హుజురాబాద్ బైపోల్ కు బీజేపీ ఇంఛార్జ్ లు వీళ్లే..

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం మండలాల వారీగా ఇంచార్జ్ లను నియమించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. హుజురాబాద్ టౌన్ కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంటకు ఎంపీ అరవింద్ ను ఇంచార్జ్ గా నియమించారు. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేష్ రెడ్డి, కమలాపూర్ కు మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ను ఇంచార్జ్ లుగా నియమించారు. కోఆర్డినేటర్ గా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇప్పటికే హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జిగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అపాయింట్ చేశారు. కో ఇంఛార్జ్ లుగా మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణలను నియమించారు. హుజూరాబాద్ లో ఉదయం 11గంటలకు ఇంఛార్జ్ లు, ముఖ్యనేతల మీటింగ్ ఉంది. దీంతో బిజెపి నేతలు హుజూరాబాద్ బయల్దేరి వెళ్లారు.

Read More
* కట్నం వేధింపులు.. బాత్రూంలో శవమైన మెడికల్ స్టూడెంట్