కేపీహెచ్బీలో బండి సంజయ్ చాయ్ పే చర్చా

కేపీహెచ్బీలో బండి సంజయ్ చాయ్ పే చర్చా

బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో ఆయన చాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. అర్ధులకు దళితబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం లేదని వాపోయారు. కాలనీలో పార్కులు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని..అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 


కేపీహెచ్బీ కమ్యూనిటీ సెంటర్ నుంచి మూడో రోజు బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభమైంది. శేష గ్రాండ్ హోటల్, రెయిన్బో విస్టాస్, అంజయ్య నగర్, చిత్తారమ్మ ఆలయం, మూసాపేట, భరత్ నగర్ అండర్ బ్రిడ్జి, జింకలవాడ, దీన్ దయాల్ నగర్, పైపులైను రోడ్డు, శోభనా థియేటర్ మీదుగా బాల్నగర్ గ్రామం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. వీఆర్ఏలపై పోలీసుల లాఠీచార్జ్ ను నిరసిస్తూ నల్లబ్యాడ్జిలు ధరించి పాదయాత్ర చేపట్టారు.