
హైదరాబాద్, వెలుగు : సీఎం కేసీఆర్ టైం పాస్ రాజకీయాలు చేస్తున్నా రని, రాష్ట్ర అభివృద్ధిపై ఏ మాత్రం ధ్యాస పెట్డడం లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ విమర్శిం చారు. కేంద్ర సర్కార్ను బద్నాం చేస్తూ కాలం గడుపుతున్నారని, ఆయనకు వేరే పనేం లేదని దుయ్యబట్టారు. హనుమకొండ జిల్లా హసన్ పర్తికి చెందిన మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీ నాగమల్ల ఝాన్సీ గురువారం పార్టీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ సమ క్షంలో బీజేపీలో చేరారు. ఈ సంద ర్భంగా సంజయ్ మాట్లాడుతూ... తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నా రన్నారు. మోడీ హైదరాబాద్ టూర్ ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కార్యా లయంలో అధికారులు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో పోలీసు అధికారులు, బీజేపీ నేతలు రాం చందర్ రావు, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.