రాష్ట్రానికి కేంద్ర హైపవర్ కమిటీ..

రాష్ట్రానికి కేంద్ర హైపవర్ కమిటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వరదల వల్ల సంభవించిన నష్టాన్ని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అమిత్ షాకు వివరించారు. వెంటనే స్పందించిన అమిత్ షా..ఉన్నతస్థాయి బృందాన్ని తక్షణమే తెలంగాణకు పంపాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అమిత్ షా ఆదేశాలతో రాష్ట్రానికి రానున్న హైపవర్ కమిటీ.. వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. 

కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవగా..ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  పంటలు నీటమునిగి రైతులకు అపారనష్టం వాటిల్లింది. ఉమ్మడి అదిలాబాద్, భద్రాచలం, వరంగల్, కరీంగనర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలో వరదలు ముంచెత్తాయి.