కేసీఆర్ కుటుంబ చరిత్రను చెప్పాలనుకున్నారా?

కేసీఆర్ కుటుంబ చరిత్రను చెప్పాలనుకున్నారా?

యాదాద్రి టెంపుల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. టెంపుల వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయ స్థంబాలపై కేసీఆర్ బొమ్మలు చెక్కడాన్ని తప్పుబట్టిన ఆయన కొందరు నేతలతో కలిసి వాటిని పరిశీలించడానికి వెళ్లారు. దీంతో టెంపుల్ పైకి వెళ్లకుండా కింద రోడ్డు వద్దే అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్..యాదాద్రి చరిత్రను పక్కన పెట్టి టెంపుల్ పై కేసీఆర్ కుటుంబ చరిత్రను చెప్పాలనుకున్నారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ నయా నిజాం పాలనకు నిదర్శనమన్నారు. హిందువులను కేసీఆర్ అవమానిస్తున్నారని అన్నారు. వారంలో రోజుల్లో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .