కేసీఆర్ హిందూ సమాజంపై యుద్ధం ప్రకటించారు: లక్ష్మణ్

కేసీఆర్ హిందూ సమాజంపై యుద్ధం ప్రకటించారు: లక్ష్మణ్

యాదాద్రి ఆలయ స్థంబాలపై  సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ గుర్తులు చెక్కడాన్ని తీవ్రంగ ఖండించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేసీఆర్ ప్రచార కాంక్ష మాత్రమే కాకుండా హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ తో తమ మైత్రిని చాటుకుంటూ ఇందిరా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూల చిత్రాలు చెక్కించడం, మిత్ర పార్టీ అయిన కాంగ్రెస్ ను సంతృప్తి పరచడానికేనని విమర్శించారు.

కేసీఆర్  హిందూ సమాజంపై, ఆధ్యాత్మికమైన సంస్థలపై, సంస్కృతిపై యుద్ధం ప్రకటించినట్లుగా కనిపిస్తుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను దెబ్బతీయాలన్న ఆలోచన సరైంది కాదన్నారు. కేసీఆర్ ప్రచార కాంక్షతో అధికార దుర్వినియోగానికి పాల్పడడం ఇదేమీ కొత్తకాదన్నారు. గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలను సొంత పార్టీ కార్యక్రమాల్లా భావించి గులాబీ రంగులను టీఆర్ఎస్ విరివిగా వినియోగించిందన్నారు. ప్రభుత్వ నిధులతో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభలనూ గులాబీమయం చేశారని విమర్శించారు. పార్టీలకు అతీతంగా నిర్వహించాల్సిన కార్యక్రమంలో అన్నింటా గులాబీ రంగు వాడారన్నారు లక్ష్మణ్.