
- మరోసారి మోదీ ప్రభుత్వాన్ని గెలిపిద్దాం
- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి
షాద్ నగర్, వెలుగు : దేశాభివృద్ధి,పేదల సంక్షేమం, రైతు సాధికారత బీజేపీతోనే సాధ్యమని, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
దేశవ్యాప్తంగా బీజేపీ చేపట్టిన గావ్ చలో -ఘర్ చలో ద్వారా పదేండ్లలో ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రచారం చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేద్దామని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 20న ప్రారంభమయ్యే నాగర్ కర్నూల్
మహబూబ్ నగర్, నల్గొండ పార్లమెంట్ల క్లస్టర్ యాత్రలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు అందె బాబయ్య, దొడల వెంకటేష్ యాదవ్, వంశీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Also Read : మరో 60 గ్రూప్ 1 పోస్టులు.. భర్తీకి ప్రభుత్వం అనుమతి