మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో మీటింగ్

మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో మీటింగ్

హైదరాబాద్‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికపై శనివారం బీజేపీ స్టీరింగ్ కమిటీ సమావేశం కానుంది. స్టీరింగ్‌‌ కమిటీ చైర్మన్‌‌, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ స్టేట్ ఆఫీసులో సమావేశం జరుగనుంది.

కమిటీ కోఆర్డినేటర్‌‌ గొంగిడి మనోహర్‌‌ రెడ్డి, సభ్యులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌‌, మాజీ ఎంపీలు జితేందర్‌‌రెడ్డి, గరికపాటి మోహన్‌‌రావు, విజయశాంతి, రవీందర్‌‌ నాయక్‌‌, రాపోలు ఆనందభాస్కర్‌‌, కౌన్సిల్‌‌ మాజీ చైర్మన్‌‌ స్వామిగౌడ్‌‌, మాజీ మంత్రి చంద్రశేఖర్‌‌, మాజీ ఎమ్మల్యే యెండల లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్సీ దిలీప్‌‌కుమార్‌‌, దుగ్యాల ప్రదీప్‌‌కుమార్‌‌, ఆచారి, దాసోజు శ్రవణ్‌‌ సమావేశంలో పాల్గొననున్నారు.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుపై పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలు, వ్యూహ రచన తదితర అంశాల గురించి సమావేశంలో చర్చించనున్నారు.