V6 News

ఇవాళ, రేపు తెలంగాణలో సునీల్ బన్సల్ టూర్

ఇవాళ, రేపు తెలంగాణలో సునీల్ బన్సల్ టూర్

మిషన్  90 లక్ష్యంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​గా సునీల్ బన్సల్​ ఇవాళ, రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. ఇవాళ  ఉదయం 10 గంటలకు కూకట్ పల్లిలో జరగనున్న మల్కాజ్ గిరి  పార్లమెంట్ నియోజకవర్గం సమావేశంలో పాల్గొనున్నారు.  మధ్యహ్నo 3 గంటలకు బండి‌ సంజయ్  అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల కన్వీనర్, సహ కన్వీనర్, ప్రభారీ, విస్తారక్ లతో బన్సల్ కీలక భేటీ కానున్నారు. 

రేపు(12న) ఉదయం పటాన్‌చెరులో జరగనున్న మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం.. మధ్యాహ్నం జరగనున్న భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలకు సునీల్ బన్సల్ చీఫ్ గెస్ట్ గా  హాజరుకానున్నారు.  పార్టీ సంస్థాగత బలోపేతం,  ప్రజా సమస్యలపై పోరాటం,  కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలే లక్ష్యంగా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.