V6 News

కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన (TRS).. తెలంగాణ రాష్ట్ర సేన కాదు.. !

కవిత పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన (TRS).. తెలంగాణ రాష్ట్ర సేన కాదు.. !

కల్వకుంట్ల కవిత పార్టీ ప్రకటించినప్పుడు చెప్పిన పేరు ఇప్పుడు మారిపోయింది. TRS.. తెలంగాణ రాష్ట్ర సేన అని ఆవిర్భావ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల సంఘం గుర్తింపు దగ్గర పార్టీ పేరు మారింది. తెలంగాణ రాష్ట్ర సేన కాకుండా.. తెలంగాణ రక్షణ సేనగా ఎన్నికల సంఘం గుర్తిస్తూ.. ఆమోద ముద్ర వేసింది. 

ఈ విషయాన్ని కవిత స్వయంగా వెల్లడించారు. తెలంగాణ రక్షణ సేన (TRS)కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని సమస్త తెలంగాణ సమాజానికి తెలియ జేయటానికి సంతోషిస్తున్నాం అంటూ స్పష్టం చేశారామె. 

2026, జనవరిలో జాతీయ ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నాం. అందులో మూడో ప్రాధాన్యతగా మేము ఇచ్చిన పేరును ఈసీ ఆమోదించటం కేవలం యాదృచ్ఛికం.. TRS నాకు రాసి పెట్టుందేమో అంటూ అంటూ Xలో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు కవిత.