
పౌరసత్వ సవరణ చట్టం, NRCలకు వ్యతిరేకంగా బెంగాల్ అంతటా నిరసనలకు పిలుపునిచ్చారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ లో 23న ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. తాను ఐక్యరాజ్య సమితి కలగజేసుకోవాలని చెప్పలేదని రెఫరెండం మాత్రం జరగాలని చెప్పానన్నారు. CAA మంచిది కానందునే… లోక్ సభలో ప్రధాని మోడీ ఓటేయలేదని ఆరోపిచారు మమత. మమతా బెనర్జీ మాటలను ఖండించారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. దేశ అంతర్గత థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ మెంట్ అక్కర్లేదన్నారు. మమత బాధ్యతలేని సీఎం అన్నారు నిర్మల. CAAతో ఎవరి హక్కులు లాక్కోవడంలేదన్నారు మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ. నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరారు.