అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం కడతాం: రాజ్‌నాథ్

అయోధ్యలో అద్భుతమైన రామ మందిరం కడతాం: రాజ్‌నాథ్

బొకారో: అయోధ్యలో అద్భుతమైన రామ మందిరాన్ని నిర్మిస్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. తమ పార్టీ చాలా కాలం నుంచి ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో పెడుతూ వచ్చిన రామ జన్మభూమిలో దివ్యమైన మందిర నిర్మాణం త్వరలోనే నెరవేర్చబోతున్నామన్నారు. కొన్ని పార్టీలు ఈ హామీ విషయంలో తప్పుబడుతున్నాయని, అవేవీ ఇప్పుడు రామ మందిర నిర్మాణం చేయకుండా తమను అడ్డుకోలేవని అన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బొకారోలో ఆయన మాట్లాడారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నార్సీ (జాతీయ పౌరసత్వ రిజిస్టర్)ను అమలు చేస్తామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా ఉంటున్న వలసదారులెవన్నది తెలుసుకునే హక్కు పౌరులందరికీ ఉందన్నారు. ఈ విషయంలోనూ కొన్ని పార్టీలు తమను తప్పుబడుతున్నాయని, దీనికి మతం రంగు పులుముతున్నాయని మండిపడ్డారు రాజ్ నాథ్. శనివారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో ప్రజల స్పందన చూస్తే జార్ఖండ్‌లో పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని  స్పష్టమవుతోందన్నారు. ప్రధాని మోడీ, బీజేపీ సీఎంలు, మంత్రులు ఏ ఒక్కరిపైనా అవినీతిపరులని ఆరోపించే ధైర్యం ప్రతిపక్షాలకు లేదన్నారు.

MORE NEWS:

జార్ఖండ్‌లో 64.12 శాతం పోలింగ్

ఆ నలుగురే కాదు: వీళ్లు ముసుగేసుకున్న మృగాలు