సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే బీజేపీ నేతలపై దాడులు

V6 Velugu Posted on Jan 29, 2022

సీఎం కేసీఆర్ డైరెక్షన్లోనే తమ పార్టీ నేతలపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సమస్యల నుంచి జనం దృష్టి మరల్చేందుకే దాడులకు తెగబడుతున్నారని అన్నారు. కొందరు పోలీసులు కేసీఆర్కు కొమ్ము కాస్తున్నారన్న సంజయ్.. అరాచకాలు, కుట్రలతో ఎన్నికల్లో గెలిచేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్పై రైతులు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని సంజయ్ హెచ్చరించారు. 
మరోవైపు బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులను నిరసిస్తూ బీజేపీ ఫిబ్రవరి 4న చలో డీజీపీ ఆఫీస్కు పిలుపునిచ్చింది. పార్టీ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు నేతలు చెప్పారు. పోలీసులు టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. ర్యాలీగా డీజీపీ మహేందర్ రెడ్డికి మెమోరాండం ఇవ్వనున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

మీ పాలనలో నిరుద్యోగం పెరిగింది నిజం కాదా..?

మహిళా కమిషన్ నోటీసులు.. గర్భిణుల రూల్ మార్చిన ఎస్బీఐ

Tagged Bjp, Bandi Sanjay, rally, telanganga, chalo dgp office

Latest Videos

Subscribe Now

More News