బీజేపీకి పెరిగిన 10శాతం ఓటింగ్

బీజేపీకి పెరిగిన 10శాతం ఓటింగ్

గత లోక్ సభ ఎన్నికల కంటే ఈ సారి 10 శాతం ఓటింగ్ ను పెంచుకుంది బీజేపీ. దీంతో ఏకంగా.. 300 లోక్ సభ సీట్లు గెలుచుకోబోతుంది. దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రెండవసారి అవతరించనుంది. గత ఎన్నికలలో 282 సీట్లు గెలువగా ఇప్పుడు ఆ రికార్డును కూడా తిరగరాయనుంది.

మోడీ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు ఈ విజయానికి భాటలుగా నిలిచాయని అంటున్నారు బీజేపీ నాయకులు. పైగా మోడీ ప్రభుత్వంలో అవినీతి జరగకపోవడం కూడా విజయానికి కారణమని అన్నారు. పెద్ద నోట్ల రద్ధు, జీఎస్ టీ లాంటి నిర్ణయాలను కూడా ప్రజలు స్వాగతించినట్టు తెలుస్తోందని తెలిపారు.

1957 లో జవహార్ లాల్ నెహ్రూ రెండవసారి తన ప్రభుత్వాన్ని పూర్తి మెజారిటీతో గెలిపించుకోగా.. ఇప్పుడు ప్రధాని మోడీ ఆరికార్డును చేరారు.