అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను బీజేపీ అమలు చేస్తుంది : బండి సంజయ్

అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను బీజేపీ అమలు చేస్తుంది : బండి సంజయ్

కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అనువనువునా అవమానించిందని ఆరోపించారు.  అంబేద్కర్ పై కాంగ్రెస్ చూపిస్తోన్న ప్రేమ.. పొడిచి చంపి సంతాపం తెలిపినట్లుందని విమర్శించారు. 10 ఏళ్ల మోదీ పాలనపై జనమే తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు. 

 నిరసన పేరుతో కాంగ్రెస్ నేతలు చేసిన దీక్షలు చేయడం ఎన్నికల స్టంట్ అని బండి సంజయ్ తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను బీజేపీ పార్టీ అమలు చేస్తుందని  అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.