
మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ కొన్ని వార్డుల్లోనే విజయం సాధించింది. రంగారెడ్డి జిల్లా ఆమన్ గల్ మున్సిపాలిటీలో మాత్రం బీజేపీ బోణీ కొట్టింది. మొత్తం 15 వార్డులున్న ఆ మున్సిపాలిటీలో బీజేపీ 12 స్థానాల్లో గెలుపొందగా ఇండిపెండెంట్‌లు ఒక్క స్థానంలో గెలిచారు. మిగతా స్థానాల్లోనూ బీజేపీ లీడ్ లో ఉంది. ఇక టీఆర్ఎస్ ఒకే ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది.