
న్యూఢిల్లీ: “ మోడీ 2.0లో మొదటిసారి జరిగిన రెండు ఎలక్షన్స్‌లో బీజేపీ విజయం సాధించింది. కార్యకర్తలందరికీ నా అభినందనలు” అని బీజేపీ ప్రెసిడెంట్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఢిల్లీలో గురువారం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో బీజేపీ – శివసేన కూటమి భారీ విజయం సాధించిందని, హర్యానాలో అతిపెద్ద పార్టీగా అవతరించామని కార్యకర్తలతో అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ తదితర అంశాలను గుర్తు చేశారు. మోడీ లీడర్ షిప్‌లో ఐదేళ్లలో ఖట్టర్ ప్రభుత్వం హర్యానా ప్రజల సంక్షేమం కోసం చాలా చేసిందన్నారు.