
- కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుట ఆందోళన
- రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం
ఖమ్మం టౌన్, వెలుగు: పీఎం నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆదివారం ఖమ్మం సిటీలో ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ నుంచి జడ్పీ సెంటర్ వరకు బీజేపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైరా రోడ్డులో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించారు. ఖమ్మం టూ టౌన్ పోలీసులు పార్టీ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన వారిని అడ్డుకుని ఖమ్మం పీఎస్ కు తరలించారు. అనంతరం బీజేపీ నాయకులు జడ్పీ సెంటర్‌కు చేరుకుని అక్కడ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మోదీ నాయకత్వం గురించి ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే వారి తల్లిని రాహుల్ గాంధీ అవమానించడం క్షమించరాని నేరం అన్నారు. కార్యక్రమంలో ఉదయ్ ప్రతాప్, విద్యాసాగర్, సుబ్బారావు, అంజయ్య, వెంకటేశ్వర్లు, సుదర్శన్ మిశ్రా, అరుణ, అనిత, విజయ రెడ్డి, మల్లీశ్వరి, నరేశ్, వంశీ, నాగేందర్, ప్రవీణ్ కుమార్, సత్యనారాయణ, రాజేశ్, మహేందర్ సింగ్, వెంకటేశ్, మనీ, రజినీ రెడ్డి, కృష్ణచారి, ప్రతాప్, మాధవ్, యుగంధర్ పాల్గొన్నారు.