
రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చారు బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. ఆయనకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం పలికారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ నేతలు. జేపీ నడ్డాను గజమాలతో సత్కరించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు నడ్డా. ఆయన రాకతో ఎయిర్ పోర్టు మార్గాలన్నీ కాషాయరంగులోకి మారిపోయాయి. డప్పు చప్పుళ్లతో ఎయిర్ పోర్టు ప్రాంతం మార్మోగింది. మహిళా నేతలు, కార్యకర్తలు పార్టీ నేతకు హారతులతో స్వాగతం పలికారు. రాఖీలు కట్టారు.
తనకు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు నడ్డా. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. మొదటిసారిగా తెలంగాణకు రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న యాదాద్రి గడ్డపై ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు నడ్డా.