RR vs KKR: ఒకే ఓవర్లో కాదు ఒక్కడే కొట్టాడు: 6 బంతులకు 6 సిక్సర్ల మొనగాడు.. ఐపీఎల్ చరిత్రలో పరాగ్ సరికొత్త చరిత్ర

RR vs KKR: ఒకే ఓవర్లో కాదు ఒక్కడే కొట్టాడు: 6 బంతులకు 6 సిక్సర్ల మొనగాడు.. ఐపీఎల్ చరిత్రలో పరాగ్ సరికొత్త చరిత్ర

ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(మే 4) ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్లో కొట్టకపోయినా వ్యక్తిగతంగా పరాగ్ ఈ ఫీట్ సాధించాడు. ఇన్నింగ్స్ 13 ఓవర్లో మొయిన్ అలీ బౌలింగ్ లో వరుసగా 5 సిక్సర్లు కొట్టిన పరాగ్.. 14 ఓవర్ రెండో బంతికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడి సిక్సర్ గా మలిచాడు. ఈ రెండు ఓవర్లలో పరాగ్ కు మొదటి బాల్ ఆడే అవకాశం రాలేదు. దీంతో 6 బంతులకు ఆరు సిక్సర్లు కొట్టే అవకాశం పరాగ్ మిస్ చేసుకున్నాడు. 

ALSO READ | RR vs KKR: పరాగ్ అసమాన పోరాటం వృధా.. ఒక్క పరుగు తేడాతో కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ

ఇప్పటివరకు 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాటర్ వ్యక్తిగతంగా 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టిన ఏకైక రికార్డ్ పరాగ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5 బాల్స్ కి 5 సిక్సర్లు కొట్టిన చాలా మందే ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా పరాగ్ మాత్రమే ఈ రికార్డ్ అందుకున్నాడు. 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇక పరాజయం ఖామనుకుంటున్న దశలో ఈ మ్యాచ్ లో అసమానంగా పోరాడాడు. 45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 95 పరుగులు చేసి రాజస్థాన్ ను విన్నింగ్ రేస్ లోకి తీసుకొచ్చాడు. ఇన్నింగ్స్ 18 ఓవర్ నాలుగో బంతికి హర్షిత్ రానా బౌలింగ్ లో ఔటవ్వడంతో రాజస్థాన్ పరాజయం ఖాయమైంది. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం (మే 4) రాజస్థాన్ రాయల్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక్క పరుగు తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ (45 బంతుల్లో 95:6 ఫోర్లు, 8 సిక్సర్లు) ఒంటరి పోరాటానికి తోడు చివర్లో శుభం దుబే (25) కోల్‌కతా నైట్ రైడర్స్ ను వణికించినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల చేసి ఓడిపోయింది.