
పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శశాంక్ సింగ్ తన సిక్సర్ పవర్ చూపించాడు. ఆదివారం (మే 4) ధర్మశాల వేదికగా లక్నో సూపర్ జయింట్స్ పై భారీ సిక్సర్ కొట్టి ఫ్యాన్స్ తో పాటు ఆ జట్టు ఫ్రాంచైజీ ప్రీతీ జింటాకు థ్రిల్లింగ్ మూమెంట్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 17 ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. మయాంక్ వేసిన 17 ఓవర్ నాలుగో బంతిని శశాంక్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ కొట్టాడు. ఈ బాల్ స్టేడియం చివర్లో ఉన్న రూఫ్ కు తగిలి అక్కడ నుంచి బయట పడింది. దీంతో కొత్త బాల్ తెప్పించాల్సి వచ్చింది.
శశాంక్ సింగ్ కొట్టిన షాట్ కు పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతీ జింటా ఫిదా అయింది. పట్టరాని సంతోషంతో నోరెళ్ళ బెట్టింది. పంజాబ్ ఇన్నింగ్స్ మొత్తానికి ఈ సిక్సర్ హైలెట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో శశాంక్ 15 బంతుల్లోనే 4 ఫోర్లు, సిక్సర్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(48 బంతుల్లో 91:6 ఫోర్లు, 7 సిక్సర్లు) చెలరేగి ఆడడంతో పాటు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్(45), శశాంక్ సింగ్ (33) మెరుపులు మెరిపించారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది.
లక్ష్య ఛేదనలో లక్నో సూపర్ జయింట్స్ ప్రస్తుతం 9 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి ఓటమి దిశగా పయనిస్తోంది. మిల్లర్(10) బదోని(17) క్రీజ్ లో ఉన్నారు. మార్కరం(13), మార్ష్(0), పూరన్(6) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు.. ఓమార్జాయి ఒక వికెట్ తీసుకున్నారు.