
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ.నడ్డా ఈనెల 18వ తేదీన రాష్ట్రానికి రానున్నారని తెలిపారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్.18వతేదీ మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ చేరుకుంటారని అన్నారు. ముందుగా మున్సిపల్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ ఇంచార్జ్ లతో సమావేశం జరగనుందని.. సాయంత్రం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభ లో నడ్డా మట్లాడుతారని లక్ష్మణ్ చెప్పారు. అదేరోజు రాత్రి కోర్ కమిటీతో విందు, సమావేశం, భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని అన్నారు. రాత్రి హైదరాబాద్ లోనే నడ్డా ఉంటారని తెలిపారు.
19వ తేదీ పొద్దున బాగ్ లింగంపల్లిలోని EWS క్వార్టర్స్ లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నడ్డా పాల్గొంటారని లక్ష్మణ్ తెలిపారు. ఆతర్వాత అంబెద్కర్ కాలేజీలో మొక్కలు నాటుతారని చెప్పారు. కాంగ్రెస్ నేతల పరిస్థితి చూస్తే జాలేస్తుందని… రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఇళ్లకు ఉత్తమ్ వెళ్లి బీజేపీలో చేరొద్దని బతిమిలాడుతున్నారని అన్నారు లక్ష్మణ్. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బంగారు కొండలు.. వేరే పార్టీలోకి వెళ్తే ఔట్ డేటెడ్ ఎలా అవుతారని టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు లక్ష్మణ్. త్వరలో ఔట్ డేటెడ్ ప్రభుత్వం పోయి అప్డేటెడ్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.