మోహిని ఏకాదశి: లక్ష్మీదేవిని.. విష్ణుమూర్తిని పూజిస్తే ఆనందం శ్రేయస్సు .. ఎప్పుడంటే..

మోహిని ఏకాదశి:  లక్ష్మీదేవిని.. విష్ణుమూర్తిని పూజిస్తే ఆనందం శ్రేయస్సు .. ఎప్పుడంటే..

ప్రతి ఏకాదశికి ఎంతో  విశిష్టత ఉంటుంది.  నెలకు రెండు సార్లు ఏకాదశి తిథి వస్తుంది.  ఏడాదిలో మొత్తం 24 ఏకాదశిలు వస్తాయి.  వైశాఖమాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని  ఏకాదశి అంటారు.  ఈ ఏడాది మోహిని ఏకాదశి  మే 8 వ తేది వచ్చింది. ఆ రోజున విష్ణువుకి సంబంధించిన మోహిని రూపాన్ని పూజిస్తే ఆనందం .. శ్రేయస్సు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.  ఆ రోజు ఎలా పూజ చేయాలి.. పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. . . . 

ఏకాదశి తిథి అంటే  విష్ణుమూర్తికి చాలా ఇష్టం.   మోహిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండి తులసి  చెట్టును పూజించాలి.  దీని వలన జీవితంలో ఆనందం.. శ్రేయస్సు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. హిందూ క్యాలండర్​ ప్రకారం   ఈ  ఏడాది మోహిని ఏకాదశి మే 8 వ తేది వచ్చింది.   

మోహిని ఏకాదశి శుభముహూర్తం: 

  • మోహిని ఏకాదశి తిథి ప్రారంభం : మే 7 ఉదయం 10.19 గంటలకు
  • మోహిని ఏకాదశి తిథి ముగింపే  : మే 8 మధ్యాహ్నం 12.29 గంటలకు
  • ఉదయం తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కావున మే 8 వ తేదీన మోహిని ఏకాదశి  వ్రతాన్ని ఆచరిస్తారు. 

Also Read : పెళ్లికి ఆటంకాలు వస్తున్నాయా.. 

మోహిని ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అమ్మవారిని పూజించాలి.  మోహిని విష్ణువు రూపం. .  ఉపవాస దీక్షను పాటించి ఆ రోజు అంతా స్వామిధ్యానంలో గడపాలి.  విష్ణుసహస్రనామం పఠించాలి.  స్వామి వారికి పచ్చని పండ్లను.. పసుపు రంగు స్వీట్లను నివేదించాలి.   

మోహిని ఏకాదశి నాడు ఏమి చేయాలి?

  • సూర్యోదయానికి ముందే  నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి.  స్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించాలి.  లేదంటే ఉతికిన బట్టలైనా కట్టుకోవచ్చు.
  • దేవుని మందిరం దగ్గర మోహిని అవతారమైన విష్ణుమూర్తి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి.  గంగా జలం ఉంటే ఆ స్థలాన్ని శుద్ది చేసుకోండి. 
  • విష్ణుమూర్తికి... అమ్మవారికి తులసి దళాల దండను సమర్పించండి.  అయితే ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో  తులసి చెట్టును ముట్టుకోరాదు.  ముందు రోజే కోసి ఆకులను శుభ్రమైన ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. 
  • విష్ణుమూర్తి చిత్ర పటాన్ని పసుపు.. కుంకుమ..  గంధంతో అలంకారం చేయాలి. స్వామివారికి పసుపురంగు వస్త్రాలు కట్టాలి. 
  • మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తిని...పూజించాలి.  విష్ణు సహస్రనామం చదవాలి.  లేకపోతే భక్తితో వినాలి. పూజలో తులసి దళాలను  తప్పని సరిగా ఉపయోగించాలి. 
  •  ఎందుకంటే మోహినికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం.
  • మోహిని ఏకాదశి ఉపవాసం పాటించేవారు సాత్వికంగా ఉండాలి.
  •  ముందు రోజు నుంచి అంటే దశమి తిథి( మే 7 ) నుంచే సాత్విక ఆహారాన్ని తినాలి.
  • ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆవును సేవించండి. వాటికి పచ్చి గడ్డిని ఆహారంగా అందించండి.
  • మోహిని ఏకాదశి రోజున పూజ తర్వాత, తమ శక్తి మేరకు ధాన్యాలు, బెల్లం, డబ్బు దానం చేయాలి.

మే 8 వ తేది ఈ పనులు అస్సలు చేయొద్దు..

  • తులసి చెట్టును తాకరాదు.  ఆరోజు తులసి చెట్టుకు నీళ్లు పోయరాదు.  ఎందుకంటే ఏకాదశి రోజు తులసీ మాత ఉపవాస దీక్షను పాటిస్తుంది.
  • మోహిని ఏకాదశిరోజు ఉపవాసం ఉండాలి.  ఆరోగ్య కారణాల రీత్యా ఉండలేని వారు  పాలు.. పండ్లు తీసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో బియ్యంతో వండిన పదార్థాలను తినకూడదు.  
  • ఏకాదశి రోజు నల్లని రంగు బట్టలు వేసుకోకూడదు. 
  • పెద్దలను.. స్త్రీలను.. ఎవరిని కూడా అమానపరచకూడదు. హేళనగా మాట్లాడకూడదు. 
  • ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించకూడదు. 
  • అసభ్యకరంగా మాట్లాడకూడదు.  పొగాకు.. జరదా వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.  సిగరెట్.. లిక్కర్​.. మాంసాహారానికి దూరంగా ఉండాలి.