ఇదేనా మీ జాతీయత.. పహల్గాం బాధిత లెఫ్టినెంట్ భార్యపై ట్రోల్స్.. టీఎంసీ ఎంపీ గోఖలే ఫైర్

ఇదేనా మీ జాతీయత.. పహల్గాం బాధిత లెఫ్టినెంట్ భార్యపై ట్రోల్స్.. టీఎంసీ ఎంపీ గోఖలే ఫైర్

పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ సబర్వాల్ భార్యపై ట్రోల్స్ విషయంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే. పహల్గాం ఉగ్రదాడి బాధిత నేవీ అధికారి భార్యపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చూడటం దిగ్భ్రాంతికరమని... ఆమెపై ట్రోల్స్ షేర్ చేస్తున్న చాలా అకౌంట్స్ బీజేపీకి సంబంధించినవే అని అన్నారు. మత సామరస్యం కోరినందుకే ఆమెను ట్రోల్ చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు గోఖలే. సదరు అకౌంట్స్ ని ఇంకా బ్లాక్ చేయలేదు... ఇదేనా మీ జాతీయత అంటూ ప్రశ్నించారు. ఈ అంశంపై ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు గోఖలే.

లెఫ్టినేట్ వినయ్ 27వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమంలో భార్య హమన్షి నర్వాల్ శాంతి, మత సామరస్యం గురించి వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు, కాశ్మీరీల వెంట ప్రజలు వెళ్లాలని మేము కోరుకోవడం లేదని..  మేము ప్రస్తుతం శాంతిని మాత్రమే కోరుకుంటున్నామని... మాకు న్యాయం కావాలని అన్నారు హిమన్షి. ఘాతుకానికి పాల్పడ్డవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హిమన్షి. హిమన్షి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. 

హిమన్షి నర్వాల్ పై ట్రోల్స్ ని తీవ్రంగా ఖండించింది జాతీయ మహిళా కమిషన్. ఈ పరిణామం దురదృష్టకరమని పేర్కొంది కమిషన్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేసింది మహిళా కమిషన్.