
హిందువులు చేసే ముఖ్యమైన యాత్రల్లో చార్ ధామ్ యాత్ర ఒకటి. ఈ యాత్రలో హిందువులు నాలుగు క్షేత్రాలను దర్శించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు తెరచుకున్నాయి. చార్ధామ్ యాత్ర యమునోత్రి ఆలయం దర్శనంతోనే ఎందుకు ప్రారంభం అవుతుందో తెలుసుకుందాం. . .
యమునోత్రి ఆలయం ఉత్తరాఖండ్‌లో యమునా నది తీరంలో ఉంది. పురాణాల్లో యమునా నదిని దేవతగా వర్ణించారు. ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం .. యమునోత్రి నది... అంటే యమునా నది మృత్యుదేవత అయిన యమరాజు సోదరి. యమునోత్రి నదిని సందర్శించి.. స్నానం చేసిన వారికి ఈ యాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగవని.. మరణించిన తరువాత మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే చార్ధామ్ యాత్ర చేసేవారు యమునా నదిలో స్నానం చేసి.. యమునోత్రి ఆలయాన్ని సందర్శించి ప్రారంభిస్తారు.
వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిక్కు నుంచి తూర్పు దిక్కుకు ప్రయాణాలు చేస్తే ఎలాంటి ఆటంకాలు ఉండవని వాస్తు పండితులు చెబుతుంటారు. చార్ ధామ్‌లో యమునోత్రి ఆలయం పశ్చిమ దిక్కులో ఉంది. ముందుగా యమునోత్రి ఆలయాన్ని సందర్శించి అక్కడి నుంచి తూర్పు దిక్కుకు వెళతారు. శాస్త్రం ప్రకారం అలా చేసే ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.
Also Read : లక్ష్మీదేవిని.. విష్ణుమూర్తిని పూజిస్తే ఆనందం శ్రేయస్సు .. ఎప్పుడంటే..
పూర్వ కాలంలో రుషులు.. సాధువులు.. దేవతలు.. మునులు రోజు యమునా నదిలో స్నానం చేసి ఆ తరువాత దిన చర్యకు శ్రీకారం చుట్టేవారని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతుంటారు. అదే సంప్రదాయం ఇప్పటికి కొనసాగుతుంది. అందుకే చార్ధామ్ యాత్ర చేసేవారు ముందుగా యమునా నదిలో స్నానం చేసి యుమునోత్రి ఆలయాన్ని దర్శించుకుంటారు.
చార్ధామ్ యాత్ర చేసే భక్తులు ముందుగా రిజిష్ట్రేన్ చేసుకోవాలి. ఈ యాత్రలో ఉత్తరాఖండ్ లోని నాలుగు పుణ్య క్షేత్రాలను దర్శిస్తారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్ బద్రీనాథ్ ధామ్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది చార్‌ధామ్‌ను సందర్శించడానికి వస్తారు. చార్ధామ్ యాత్రలో ముందుగా యమునోత్రి ఆలయాన్ని సందర్శిస్తారు.