హిందూ రాజ్యమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది : ప్రదీప్ సింగ్ ఠాకూర్

హిందూ రాజ్యమే లక్ష్యంగా బీజేపీ పని చేస్తోంది :  ప్రదీప్ సింగ్ ఠాకూర్
  • సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జాతీయ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సింగ్ ఠాకూర్

ఖమ్మం టౌన్, వెలుగు: బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూరాజ్య స్థాపన లక్ష్యంగా పనిచేస్తోందని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా జాతీయ జనరల్ సెక్రెటరీ ప్రదీప్ సింగ్ ఠాకూర్ ఆరోపించారు. ఆదివారం ఖమ్మం సిటీలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో మూడు రోజుల పాటు జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై జాతీయ సహాయ కార్యదర్శి పోటు రంగారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జీఎస్టీ విధానంలో రెండు స్లాబ్ లను రద్దు చేసి ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

పీఎం మోదీ జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపి వారి మరణాలకు కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషన్ ఇంటెన్సివ్ పేరుతో బలహీన వర్గాల ఓటు హక్కును రద్దు చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. రంగారావు మాట్లాడుతూ .. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ టెక్నికల్ సమస్యతో మూతపడ్డదని గుర్తు చేశారు.  రాష్ట్రంలో యూరియా కొరత సృష్టికి కారణం కేంద్ర ప్రభుత్వ మేనని ఆరోపించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ ను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.  గవర్నర్ ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జాతీయ నాయకులు సుభాష్ దేవ్, రామ చంద్రరావు, ప్రవీణ్, సూర్యం, కృష్ణ సింగ్, పూజారావు, రమ పాల్గొన్నారు.