
కామారెడ్డి, వెలుగు : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామా చేస్తోందని బీజేపీ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ నీలం చిన్న రాజులు విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ముస్లింలను బీసీలలో కలుపకుండా రిజర్వేషన్ పక్రియ చేపట్టాలన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేపట్టిందన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 13, 14 తేదీల్లో హర్ ఘర్ తిరంగా యాత్రను ప్రతి మండలం, గ్రామాల్లో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే అరుణతార, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీలు నరేందర్‌రెడ్డి, రవీందర్రావు, నాయకులు కిషన్‌రావు, వెంకటేశ్వర్, మోటూరి శ్రీకాంత్, వేణు, నరేందర్, శ్రీనివాస్, సంతోష్‌రెడ్డి, రవీందర్, రాజగోపాల్, లింగారావు, రంజిత్ పాల్గొన్నారు.