డొనేషన్లు వసూలు చేస్తున్నఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి: బీజేవైఎం డిమాండ్

డొనేషన్లు వసూలు చేస్తున్నఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి: బీజేవైఎం డిమాండ్
  • డొనేషన్లు వసూలు చేస్తున్న ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
  • హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్​కు బీజేవైఎం వినతి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అడ్మిషన్ల కోసం డొనేషన్లు వసూలు చేస్తున్న ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రిని కలిసి వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు వ్యాపార సంస్థలుగా మారాయని ఆరోపించారు. స్పాట్ అడ్మిషన్లు, స్లైడింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు త్వరలో జరిగే వీసీల రిక్రూట్మెంట్ న్యాయబద్ధంగా నిర్వహించాలని సూచించారు.