బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

బీసీ,ఎస్సీ,ఎస్టీ గురుకులాల్లో సౌకర్యాలు కల్పించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ ను ముట్టడించారు. కార్యక్రమానికి యువమోర్చా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నేతలు. హాస్టల్స్ లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు . 

వర్ధన్నపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో నిన్న రాత్రి పుడ్​ పాయిజన్​ అయ్యింది. మొత్తం 200 మంది విద్యార్థుల్లో 60 మందికి పైగా విద్యార్థినీలు పుడ్​ పాయిజనింగ్​ కు గురయ్యారు. బల్లి పడిన ఆహారం తినడంతో వాంతులు, విరేచనాలతో 30 మంది విద్యార్థినీలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనంలో బల్లి పడటంతో ఆ భోజనం తిన్న  విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.అస్వస్థతకు గురైన విద్యార్థులను వర్ధన్నపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి 13 మందిని ఎంజీఎం దవాఖానకు షిఫ్ట్​ చేశారు. వీరికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి సీరియస్​ గా ఉందని తెలుస్తోంది.  ఇటీవల రాష్ట్రంలోని పలు గురుకుల పాఠశాలల్లో ఇలాంటి ఘటనలే వరుసగా జరుగుతున్నాయి.