నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం నిరసన.. సిటీ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. అరెస్ట్

నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం నిరసన.. సిటీ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత.. అరెస్ట్

ముషీరాబాద్, వెలుగు: జాబ్ క్యాలెండర్ విడుదల చేసి రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు చేస్తున్న నిరసనకు బీజేవైఎం మద్దతు తెలిపింది.శనివారం బీజేవైఎం నాయకులు చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీకి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేవైఎం నాయకుల మధ్య తోపులాట జరిగింది. నాయకులు లైబ్రరీ గేటు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. 

ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు గణేశ్ మాట్లాడుతూ.. గత కేసీఆర్ ప్రభుత్వం కంటే మించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గొర్రెలు, బర్రెలతో నిరుద్యోగులను మోసం చేశారని, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తూ వారిపై నిర్బంధం ప్రయోగిస్తుందని ఆరోపించారు.