ప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..అడ్డుకున్న పోలీసులు

ప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం యత్నం..అడ్డుకున్న పోలీసులు

బీజేవైఎం ప్రగతిభవన్ ముట్టడి ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన బీజేవైఎం నేతలను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

అర్వింద్ ఇంటిపై దాడికి కవిత, కేటీఆర్ కారణమని.. వారిపై కేసు నమోదు చేయాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలను తిరగనివ్వమన్నారు. ఇవాళ్టి నుంచి యుద్ధం మొదలైందని చెప్పారు.

ఎంపీ అర్వింద్ ఇంటిపై టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి బీజేవైఎం పిలుపునిచ్చింది. అటు తెలంగాణ భవన్ వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు.