నల్గొండ జిల్లాలో ముగిసిన కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్..

నల్గొండ జిల్లాలో ముగిసిన కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్..

 

  • ఫైనల్లో యాదాద్రి పై నల్గొండ జిల్లా ఘన విజయం

నల్గొండ, వెలుగు: మూడు రోజులుగా ఉర్రూతలూగించిన కాకా మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ముగిసింది. ఫైనల్లో యాదాద్రి వర్సెస్ నల్గొండ జిల్లాల జట్లు తలపడగా నల్గొండ జట్టు యాదాద్రి జట్టును చిత్తుగా ఓడించి ఫైనల్ లో గెలుపొందింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నల్గొండ టీం 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. నల్గొండ టీంలో శ్రీనాథ్ యాదవ్ 23 బంతుల్లో 41( 5 ఫోర్లు, 1 సిక్స్), పగిడిమర్రి సాయినాథ్ 32 బంతుల్లో 40 నాటౌట్ (7 ఫోర్లు), ఆది మని కిరణ్ 19 బంతుల్లో 33 పరుగులు ( 5 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్ లో రాణించారు.

 యాదాద్రి జట్టులో లక్ష్మీ కాంత్ గౌడ్, విక్రమ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 193 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన యాదాద్రి టీం నల్గొండ బౌలింగ్ దాటికి తక్కువ స్కోర్ కే పరిమితమైంది. 15 ఓవర్లలో 70 పరుగులకు యాదాద్రి టీం ఆలౌట్‌ అయి 122 భారీ తేడాతో ఓడిపోయింది.

 బౌలింగ్ లో నల్గొండ టీంలో అఖిల్ 7 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా సాయినాథ్ 5 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ఫైనల్ విన్నర్స్ టీమ్ నల్గొండకి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కప్ అందజేశారు. కార్యక్రమంలో మినిస్టర్ పీఏ మధుసూదన్ రెడ్డి, జిల్లా క్రికెట్ సెక్రటరీ సయ్యద్ అమీనుద్దీన్‌, కోచ్ షఫీయుద్దీన్, బుచ్చిబాబు పాల్గొన్నారు.