టీజీపీఎస్సీని ముట్టడించిన బీజేవైఎం

టీజీపీఎస్సీని ముట్టడించిన బీజేవైఎం

హైదరాబాద్, వెలుగు: గ్రూప్–1 ప్రిలిమ్స్ నుంచి 1:100 రేషియోలో మెయిన్స్ కు ఎం పిక చెయ్యాలని బీజేవైఎం స్టేట్ ప్రెసిడెంట్ మహేందర్ కోరారు. గ్రూప్– 2, గ్రూప్– 3 నోటిఫికేషన్లలో పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలన్నారు. గ్రూప్స్ రాసే అభ్యర్థుల డిమాండ్లను నెరవేర్చలని కోరుతూ శనివారం బీజేవైఎం ఆధ్వర్యంలో  టీజీపీఎస్సీ ఆఫీస్ ను ముట్టడించే యత్నం చేశారు. ఈ సందర్భంగా  మహేందర్ మాట్లాడారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చటం లేదన్నారు. కాంగ్రెస్  ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరిస్తుందని విమర్శించారు. అలాగే కాంగ్రెస్ పదే పదే చెప్పిన జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.