విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ కలకలం

V6 Velugu Posted on Oct 04, 2020

విజయవాడ: అజిత్ సింగ్ నగర్ యార్డు రోడ్డులో బ్లేడ్ బ్యాచ్ దాడి చేసి దోపిడీ ఓ వ్యక్తిని దోపిడీ చేసిన వైనం కలకలం రేపింది. నిన్న రాత్రి దుర్గా  ప్రసాద్ ( 33 ) అనే  పాలిష్ కార్మికుడిపై బ్లేడ్లతో దాడి చేసి దోచుకున్నారు. ఇంటికి వెళ్తున్న సమయంలో మార్కెట్ యార్డు వద్ద మూత్ర విసర్జన చేస్తుండగా  ముగ్గురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు పర్సు, ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. దుర్గాప్రసాద్ తేరుకుని ప్రతిఘటించాడు. ఈ సందర్భంగా ముగ్గురితో  పెనుగులాట జరిగింది. జేబులో నుండి డబ్బులు.. శరీరంపై ఆభరణాలు లాక్కునేందుకు వెదుకులాట జరుగగా.. దుర్గాప్రసాద్ కేకలు వేస్తూ ఒక్కసారిగా తిరగబడ్డాడు. దీంతో బ్లేడ్ బ్యాచ్ సభ్యులు  పరారవుతూ.. దుర్గా ప్రసాద్ ను బ్లేడ్లతో ఛాతీ, చేయిపై దాడి చేసి గాయపరిచారు. అనంతరం  యార్డు రోడ్డు గుండా  పరారయ్యారు. బాధితుడు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. సీసీ కెమెరాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Tagged VIjayawada, investigation, case, POLICE, Amaravati, attack, with, commotion, ajithsingh nagar, batch, durga prasad, Market yard

Latest Videos

Subscribe Now

More News