భవానీపేటలో జిలెటిన్​ స్టిక్స్​తో బండరాళ్ల పేల్చివేత..పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లు, బైక్ 

భవానీపేటలో జిలెటిన్​ స్టిక్స్​తో బండరాళ్ల పేల్చివేత..పాక్షికంగా ధ్వంసమైన ఇండ్లు, బైక్ 

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట గ్రామంలో ఆదివారం బ్లాస్టింగ్​ కలకలం రేపింది. బ్లాస్టింగ్​తో చుట్టుపక్కల ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా, ఒక బైక్​ ధ్వంసమైంది. గ్రామానికి చెందిన దర్శనం సిద్దిరాములు తన వ్యవసాయ భూమిలోని బండరాళ్లను తొలగించేందుకు జిలెటిన్​ స్టిక్స్​తో బండరాళ్లను పేల్చారు.

బండరాళ్లు ఎగిరిపడి బిట్ల పోశెట్టి, ఆర్లపోచయ్య, బిట్లసాయిలు ఇండ్లపై పడడంతో దెబ్బతిన్నాయి. ఆర్ల పోచయ్యకు చెందిన బైక్​ ధ్వంసమైంది. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి సీఐ రవీందర్​నాయక్, లింగంపేట ఎస్సై పాటిల్​ వెంకట్రావు, ప్రొబేషనరీ ఎస్సై రాఘవేందర్​ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ప్రొబేషనరీ ఎస్సై తెలిపారు.